25 August, 2026 | 3:03 PM

సిసి రోడ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

25-08-2026 02:16 PM

అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

తుంగతుర్తి( విజయ క్రాంతి): తుంగతుర్తి మండలం అన్నారంలో ఎంపీ, ఎమ్మెల్యే ల నిధులతో మంజూరైన రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మంగళవారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల కల్పనకు, కృషి చేస్తామని సర్పంచ్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రత్యేక నిధుల ద్వారా, ప్రతి వార్డుకు నూతన సిసి రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో ఉపసర్పంచ వెలిశాల సరిత, వార్డు సభ్యులు, బింగి వెంకటేశ్వర్లు, సుకన్య, జానకమ్మ, మరికంటి శ్యామ్, కాంగ్రెస్ నాయకులు కుంచాల ప్రవీణ్ రెడ్డి, రమేష్, మల్లయ్య, వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దొంగరి శ్రీనివాస్, సైదులు, మనూరి పోతరాజు. తదితర గ్రామస్తులు పాల్గొన్నారు