calender_icon.png 10 August, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సంతోషిమాత జన్మదిన వేడుకలు..

09-08-2025 05:36:07 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో శనివారం సంతోషిమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారిజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అభిషేకం చేసి, నామకరణ డోలహరణ చేసి, పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం, రాఖీ పౌర్ణ మహోత్సవం ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి దత్తాత్రి, కోటి సంతోష్, శంకర్ గురుస్వామి, మల్లికార్జున్ గురుస్వామి, రాజు గురు స్వామి, అశోక్ రావు సంతోషి మాత భక్తులు పాల్గొన్నారు.