calender_icon.png 10 August, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈరోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తాం: ఫిల్మ్ ఫెడరేషన్

10-08-2025 12:40:43 PM

హైదరాబాద్: ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం(Film Federation Office) వద్ద ఆదివారం సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు వేతనాలు పెంచాలని 24 యూనియన్ల సినీ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రేపు చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే ఒకట్రెండు రోజులు సమయం ఇస్తామని, షెడ్యూల్ ఉన్న వారితోనూ మాట్లాడి ఆ చిత్రికరణలు నిలిపివేస్తామని తెలిపారు. ఈరోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు వెల్లడించారు. అలాగే నిర్మాత విశ్వప్రసాద్(Producer Vishwaprasad) నోటీసు ఎందుకు పంపారో తెలియదని, నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్ ఛాంబర్ కు నోటీసులు పంపిప్తామని పేర్కొన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పు వచ్చే వరకు విశ్వప్రసాద్ షూటింగ్ లకు హాజరుకాబోమని నేతలు అన్నారు.

పీపుల్స్ మీడియా బకాయిలు రూ.90 లక్షలు విడుదల చేయాలని, వేతనాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు జంకుతున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు తెలిపారు. సినీ కార్మికుల శ్రమకు వేతనాల కోసమే పోరాడుతున్నామని, సినీ కార్మికుల వేతనాలు పెంచడం సమస్య కాదు అని వివరించారు. బడ్జెట్ పెంచుకోవడం.. కట్టడి చేసుకోవాడం వారికి అర్థం కావట్లేదని, ఎవరిని నిందించలేక సినీ కార్మికులను అడ్డం పెట్టుకుంటున్నారని తెలిపారు. ఫెడరేషన్ తరపున కలుస్తామని చిరంజీవికి సమాచారం ఇచ్చామని, ఛాంబర్ తో చర్చలు ఫలించకపోతే జోక్యం చేసుకుంటానని ఆయన చెప్పారని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశామని, మాపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుస్తామని నేతలు వెల్లడించారు.