10-08-2025 12:42:27 PM
బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.
చిట్యాల (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుందని బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్(BJP Chityala Mandal President Burra Venkatesh Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది మహానుభావుల ప్రాణత్యాగ ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, కావున దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరణించినటువంటి మహాను భావులను ఆదర్శంగా తీసుకొని మనం మన దేశాన్ని ఐకమత్యంగా అభివృద్ధి చేసుకోవాలని చిన్ననాటి నుండే దేశం ధర్మం దేశభక్తి అలవర్చుకోవాలన్నారు.