calender_icon.png 10 August, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృష్ణ జన్మాష్టమి కరపత్రాల ఆవిష్కరణ..

09-08-2025 05:37:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ వ్యాయమశాల ఇస్కాన్ సత్సంగ భవనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కరపత్రాలను వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 17 వరకు కామారెడ్డి ఇస్కాన్ సత్సంగంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని కామారెడ్డి జిల్లా ఇస్కాన్ ప్రతినిధి వెంకట దాసు ప్రభుజి, గురు వినయ్ కుమార్, మల్లికార్జున్ గురుస్వామి తెలిపారు. ముఖ్యంగా ఆగస్టు 15 న ఉదయం 11:30 నిమిషాలకు ఉచితంగా శ్రీకృష్ణ హోమం, 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అర్ధరాత్రి వరకు జరుగుతాయని తెలిపారు. 17వ తారీఖున నందోత్సవం, శ్రీల ప్రభుపాద వ్యాస పూజ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.