calender_icon.png 10 August, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎల్ఐ కాల్వకు భారీ గండి.!

10-08-2025 12:56:10 PM

వృధాగా వరద నీరు.. 

నీట మునుగుతున్న పంట పొలాలు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం(Kalwakurthy Constituency) వెల్దండ మండలంలోని లచ్చపురం సమీపంలోనీ కేఎల్ఐ కాల్వకు ఆదివారం గండిపడి వరద నీరు వృధాగా పారుతోంది. ఏటా ఇదే తంతు కొంసాగుతోందని అయినా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా పంటపొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోక పోవడంతో కేఎల్ఐ ప్రాజెక్టు లక్ష్యం నీరు గారిపోతోందని రైతులు మండిపడుతున్నారు.