10-08-2025 12:57:36 PM
రాయల్ రియల్ ఎస్టేట్, బిల్డర్స్ ఎండి బషీరుద్దీన్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో రాయల్ రియల్ ఎస్టేట్, బిల్డర్స్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని గిరిక బాయ్ గూడెంలో నూతనంగా నిర్మాణం అవుతున్న సాయి కృష్ణ హౌసింగ్ కాలనీలో నిరుపేద ప్రజలు సొంత ఇంటి కలలు నెరవేర్చుకోవాలని ఎండి మహమ్మద్ బషీరుద్దీన్(MD Mohammed Bashiruddin) తెలిపారు. ఆదివారం ఆయన పూజలు చేసి సాయి కృష్ణ హౌసింగ్ కాలనీ బుకింగ్ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో అనుభవం కలిగి ఇప్పటికే నలగొండలోని సాగర్ రోడ్ భాగ్యనగర్ కాలనీ, ముషంపల్లి రోడ్డు ధాత్రి నగర్ కాలనీ, మేళ్ల దుప్పలపల్లి రోడ్డు శుభోదయ హౌసింగ్ కాలనీ పూర్తిచేసుకుని ఎందరికో సొంతింటి కలను సకారం జరిగిందని తెలిపారు. హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవ సందర్భంగా పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్లాట్లను బుక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ చిన్నాల జానయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజలింగం, గుండబోయిన వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.