calender_icon.png 4 June, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2025 05:45:05 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాదేవపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య(District Panchayat Officer Veerabhadraiah) జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రహ్లాదు రాథోడ్ జెండా ఆవిష్కరించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ప్రభుత్వాధికారులు జెండాలను ఆవిష్కరించారు. ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కల్పన, గ్రామపంచాయతీ సిబ్బంది ,అంగన్వాడీ టీచర్స్, ప్రజలు పాల్గొన్నారు.