15 April, 2026 | 5:17 AM

అత్వెల్లి మున్సిపల్ పట్టణంలో ఘనంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

22-11-2025 12:00 AM

మేడ్చల్ అర్బన్, నవంబర్ 21 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని అత్వెలి మున్సిపల్ పట్టణంలో గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టోత్సవాలు ఘనంగా నిర్వహించారు.మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి వార్డులో అతి పురాతన మున్సిపల్ పట్టణ పరిధిలోని అత్వెళ్లి మున్సిపల్ పట్టణంలో మూడు రోజుల దీంతో పాటు నిర్వహించే ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనాయి.

అత్వెల్లి మున్సిపల్ పట్టణంలోని వెంకయ్య కాలనీలో గల పోచమ్మ తల్లి ఆలయం శిథిలావస్థకు గురికావడంతో గ్రామస్తులు పునరుద్ధరించి నూతన ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారెడ్డి నందా రెడ్డి, రొయ్యపపల్లి మల్లేష్ గౌడ్, నారెడ్డి కొండాల్ రెడ్డి, రామచంద్రయ్య, మండల ఈశ్వరయ్య దశరథ, జైహింద్ రెడ్డి, సంజీవ తదితరులు పాల్గొన్నారు.