calender_icon.png 21 November, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సంఘాల పనితీరును పరిశీలించిన ఎన్ఐఆర్డీ బృందం

21-11-2025 11:39:01 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం సిద్దరామేశ్వర నగర్ లో శుక్రవారం గ్రామ మహిళ సంఘాల పనితీరును ఎన్ ఐ ఆర్ డి బృందం పరిశీలించింది. గ్రామ మహిళ సంఘాల పనితీరును పలు రాష్ట్రాలకు చెందిన బృందం సభ్యులు పాల్గొని పరిశీలించారు. మహిళా సంఘాల ద్వారా చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి అభినందించారు.

సంఘాల ద్వారా చేస్తున్న వ్యాపారాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. లాభాలు ఎలా వస్తున్నాయి వ్యాపారాలు ఎలా చేస్తున్నారు అనే విషయాలను మహిళా సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.