2 August, 2026 | 1:20 AM

వైభవంగా స్వామివారి చక్ర స్నానం

02-08-2026 12:10 AM

ముగిసిన విఠలేశ్వర రుక్మాబాయిల బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): అఫ్జల్‌గంజ్, గౌలిగూడ విటల్ నగర్‌లోని చారిత్రాత్మకమైన జంగల్ విఠోబా దేవాలయంలో, విఠలేశ్వర రుక్మాబాయిల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం, స్వామివారి చక్ర స్నానం పల్లకీ సేవ అత్యంత కనుల పండువుగా నిర్వహించారు.

ఆలయ, చైర్మన్ జి శంకర్ యాదవ్, అధ్యక్షులు, వి కిషన్ యాదవ్, వి పాండు యాదవ్, పి మాణిక్ రావు, ప్రధాన అర్చకులు, రాజు మహారాజ్ నేతృత్వంలో ఆలయం నుంచి విఠలేశ్వర రుక్మ బాయిల పలకీ సేవ ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో ఉన్న జగన్నాథ్ స్వామి మఠం వరకుకొనసాగింది.

స్వామివారి పల్లెకి సేవ ముందు, మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక, బ్యాండ్ మేళాను, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వాయించడంతో,చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పాండురంగని, భక్తితో సుతిస్తూ ఆధ్యాత్మిక గీతాలతో, కోలాటం ఆడుతూ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఉత్సవాలు కొనసాగినన్ని రోజులు, ఆలయంలో స్వచ్ఛందంగా సేవ చేసిన, పలువురిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, బోయిని వెంకటేష్ యాదవ్, ఆర్ నరేందర్, సల్ల ఆనంద్ యాదవ్, గోపి, శ్రీశైలం, శ్రీకాంత్, వి గణేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.