11 April, 2026 | 3:54 AM

ఘనంగా సాంస్కృ తిక వేడుకలు

11-04-2026 01:44 AM

స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల మొద టి సంవత్సరం విద్యార్థినులు ప్రారంభ్ - 2కె26 పేరిట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుక లకు సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగం అధిపతి డాక్టర్ జి పద్మశ్రీ అధ్యక్షత వహించారు.

వక్తగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ ఎల్ రాజు హాజరయ్యారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ రాజు మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, అవి భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, ఐక్యతకు సహకరిస్తా యని తెలిపారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలు, తరగతులు, పరీక్షలతో మాత్రమే పరిమితం కాదని, నిజమైన విద్య అనేది విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేదిగా ఉండాలన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా ర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారి ఆశక్తులను అభివృద్ధి చేయడానికి ఎంతో సహకరిస్తాయన్నారు.సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ జి పద్మశ్రీ మా ట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలైనా పాటలు, నృత్యాలు, నాటకాలు మొదలైనవి జీవితంలో భాగంగా ఉండాలని, అప్పుడు మాత్రమే జీవితానికి సంబంధించిన సంపూర్ణమైన అభివృద్ధి సాధ్యం కాగలదని చెప్పా రు. విద్యార్థుల ప్రదర్శనలో వారి కృషి, పట్టుదల, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తా యన్నారు.  ఈ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో అధ్యాపకులు బి శ్రీలత, డాక్టర్ జీజే రూపశ్రీ, డాక్టర్ వి మైత్రేయి, విద్యార్థి ప్రతినిధులు శాన్విత, వైష్ణవి, ధృతి తదితరులు క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ కే కృష్ణారావు, మేనేజ్‌మెంట్ సభ్యులు టి రాకేష్ రెడ్డి, ఆర్ ప్రదీప్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ రాజు, డీన్ ప్రొఫెసర్ ఏ వినయ్ బాబు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ రమేష్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.