11 April, 2026 | 3:42 AM

జూన్ 2 లోపు రెండో పీఆర్సీ ఇవ్వాలి

11-04-2026 01:42 AM
  1.   51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలి 
  2. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: టీజీఈజేఏసీ 

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): జూన్ 2 లోపు 51శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్(టీజీఈజేఏసీ) జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావుకు జేఏసీ చైర్మన్ మారం జగదీ శ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజే శారు.

ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల బిల్లును విడుదల చేయాలని, ప్రతినెలా రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులు, పెన్సనర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు కొత్తగా విధి విధానాలను రూపొందించి, మే 1 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధ రించాలన్నారు.

వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 64 సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో పీ దామోదర్‌రెడ్డి, బీ శ్యామ్, జీ సదానందంగౌడ్, కటకం రమేష్, రామారావు, బిక్షంగౌడ్, జుట్టు గజేందర్, పీ వెంకట్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి   పాల్గొన్నారు.