ఘనంగా కాటమయ్య కిట్ల పంపిణీ

28-09-2026 | 07:36pm

మల్లాపూర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం మండలానికి చెందిన గౌడ సంఘ సభ్యులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాటమయ్య కిట్ల వినియోగం, వాటి ప్రయోజనాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. కాటమయ్య కిట్లను గౌడ సంఘం సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ ఎస్సై సింధు సూచించారు. కిట్ల వినియోగంపై ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణలో సూచించిన విధానాలను పాటించాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు