18 July, 2026 | 1:15 AM

జమలాపురం సర్పంచ్‌కు ఘన సన్మానం

18-07-2026 01:15 AM

ఎర్రుపాలెం, జులై 17 (:విజయక్రాంతి): జమలాపురం సర్పంచ్ తుళ్లూరి నిర్మలా కుమారి కోటేశ్వరరావు దంపతులకు శుక్రవారం నాడు టీటీడీ కళ్యాణమండపంలో గ్రామ పౌరులు ఘనంగా సన్మానించారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన  జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో చేపట్టిన జీనోద్ధరణ ప్రాణప్రతిష్ట ధ్వజ స్తంభాల స్థాపన మహా కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు ఘనంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు.

అయితే వీటి కార్యక్రమాల అమలులో ప్రత్యక్షంగా గ్రామ సర్పంచ్ తుళ్లూరి నిర్మలాకుమారి శ్రీ వకుల మాత స్టేడియం నిర్మాణదాత, గ్రానైట్ కంపెనీ యజమాని అయిన తుళ్లూరు కోటేశ్వరరావు దంపతులచే దేవాలయంలో వీరి ఆర్థిక  సహాయ సహకారాలతో దేవస్థానంలో ఘనంగా ఈ కార్యక్రమాలు అన్నిటిని విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ,  దేవస్థానంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వీరి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు గ్రామం తరపున అందిస్తూ గ్రామ పౌరుల మన్నలను పొందుతున్నారు.

అంతేకాక గ్రామంలోని చేపట్టిన ఏ కార్యక్రమంలో అయినా వీరి భాగస్వామ్యం ఉంటుంది.  శృంగేరి శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భగవతి తీర్థ స్వామి ఆశీస్సులతో  దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమాలకు వీరి సహాయ సహకారాలు  అందించారు.

స్వర్ణోత్సవాలు జరిగిన రోజులలో దేవస్థాన శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తమ ఆర్థిక సహాయ సహకారాలతో ప్రతిరోజు మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిటిని ఘనంగా నిర్వహించినందుకు తుళ్లూరి నిర్మలా కుమారి కోటేశ్వరరావు దంపతులకు ముందుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఘనంగా దేవస్థానం తరపున ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ ఘనంగా సన్మానించారు. తరువాత గ్రామ పౌరులు నిర్మలా కుమారి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు టీడీపీ కళ్యాణ మండపంలో గ్రామ ప్రజలకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.