మెడికల్ సీటు సాధించిన నవీన్‌కు ఘన సన్మానం
26-09-2026 | 11:38am
శ్రీరంగాపూర్, సెప్టెంబర్ 26: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్(Srirangapur) మండల కేంద్రానికి చెందిన జెసిబి భగవంతు చిన్న కుమారుడు నవీన్ కుమార్ మెడికల్ సీటు సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ యాదవ్, సర్పంచ్ మదిలేటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నవీన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థి కష్టపడి మెడికల్ సీటు సాధించడం అభినందనీయమని రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. నవీన్ విద్యాభ్యాసానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పసుల రాములు, ఎస్. పురుషోత్తం యాదవ్, వందరోజుల శీను, కురుమూర్తి మహేష్, వార్డు మెంబర్ భాస్కర్, వడ్డే రాధాకృష్ణ తదితరులు పాల్గొని నవీన్‌ను అభినందించారు.