27 July, 2026 | 6:08 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

రాజ్యసభ హౌస్ కమిటీ నూతన చైర్మన్‌కు ఘన సన్మానం

01-06-2026 02:41 AM

పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె.లక్ష్మణ్ 

ముషీరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటా.. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): దేశ రాజకీయాల్లో మరో ఉన్నత స్థానాన్ని అధిరోహించి  రాజ్యసభ హౌస్ కమిటీ నూతన చైర్మన్ గా పదవీ బాద్యతలు చేపట్టిన ఓబీసీ మొర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎం.పీ డాక్టర్ కె.లక్ష్మణ్ ను గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్ అశోక్ నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో తనవంతు భాద్యతలు నిర్వర్తిస్తునే, ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ నాయకులకు, కార్యకర్తలు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో వుంటానని అన్నారు. అలాగే రాబోయే జీహెచ్‌ఎంసి  ఎన్నికల్లో మునపటి కంటే కూడా భారీ మెజారిటీతో బీజేపీ కార్పొరేటర్ లను గెలిపించుకొని, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసి,  మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం  చేసుకుంటుందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఎం. ఉమేష్, సురేష్ రాజు, ఆనంద్ రావు, సాయి గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.