చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలి
ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, మే 31 (విజయక్రాంతి): విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాలు, తల్లి దండ్రులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యు డు ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉప్ప ల్లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంపు-2026 ముగింపు సమావేశానికి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖేల్ ఇం డియా పేరుతో క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, నషముక్త భారత కావాలంటే, పిల్లలు పక్కదారి పట్టకుండా ఉండాలంటే క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరం అన్నారు. పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లలో ఆడుకోకుండా మైదానంలో ఫుట్బాల్, క్రికె ట్, కబడ్డీ వంటి క్రీడలు ఆడాలని అన్నారు. ప్రస్తుతం పిల్లలకు ఉదయం నుంచి రాత్రి వరకు చదువు తప్ప మరో ధ్యాస లేకుండా పోయిందని, ఇది ఒక్కటే సంపూర్ణత్వం ఇవ్వబోదని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థికి స్వయం ఉపాధికి విద్య తోడ్పడాలని, మార్కుల కోసం ఉండవద్దని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో పాటు క్రీడాభిమానులు కలిసి సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త, బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.






