29 April, 2026 | 3:27 AM

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

29-04-2026 12:49 AM

ముకరంపుర, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): నగరంలోని 47వ డివిజన్ రాంనగర్ లోని శ్రీ రామాసహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందడి నెలకొంది. స్థానిక కార్పొరేటర్ గాజ రమ-శివరాం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు మరియు కో-ఆప్షన్ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు గాజ రమ-శివరాం (47వ డివిజన్),బండారి వేణు (51వ డివిజన్)కర్రె పద్మ-అనిల్ (48వ డివిజన్),బండ రమణారెడ్డి (22వ డివిజన్),ఇటీవలే ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, చిగిరి రవి, ఎలగందుల నందకుమార్, మరియు బల్బీర్ సింగ్ మరియు స్థానిక నాయకులు, భక్తులు మరియు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.