18 June, 2026 | 2:44 AM

బదిలీ అయిన సిబ్బందికి ఘన సన్మానం

18-06-2026 01:45 AM

బాన్సువాడ, జూన్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన భాను ప్రకాష్తో పాటు వివిధ గ్రామపంచాయతీలలో పనిచేసిన కార్యదర్శులు ఇటీవల బదిలీపై ఇతర మండలాలకు వెళ్లిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు.

బుధవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనిధి, ఎంపీవో మహిబూబ్, ఏపీవో అక్మల్, ఏఎంసీ వైస్ చైర్మన్ యామ రాములు, సర్పంచులు బోయిని శంకర్, ధర్మతేజ, అప్పారావు, దేవీసింగ్, బాన్సువాడ మనెవ్వ, మాజీ ఎంపీపీ రఘు, బస్వారాజ్ పటేల్, కనిగిరి కాశీరాం, రాచప్ప పటేల్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన అధికారులను, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. బీర్కూర్ మండల అభివృద్ధికి వారు అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్లో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. సన్మానితులు మాట్లాడుతూ బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.