20 April, 2026 | 1:40 AM

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

20-04-2026 12:00 AM

జగదేవపూర్, ఏప్రిల్ 19: జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సేయింట్ పీటర్స్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల విద్యాధికారి సైదులు హాజరైయ్యారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. యూకేజీ, ఎల్ కె జి నర్సరీ తరగతుల చిన్న పిల్లలకు పాఠశాలలో సంతోషకరమైన వాతావరణం ఉంటే పిల్లలు చదువు పై మక్కువ చూపుతారన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్  నర్సింహా రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో  చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు పొందారు అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి క్రాంతి ఐపీఎస్ సాధించడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు రాజేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.