రామేశ్వరాలయంలో ఘనంగా హోమాలు
సుల్తానాబాద్ , మే 10 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో హనుమాన్ దీక్ష పరులు శ్రీ రామేశ్వరాలయంలో ఆదివారం ఘనంగా హోమలు నిర్వహించారు. నవగ్రహాల పూజలు, నవధాన్యాలచే పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల పండ్లు, కొబ్బరికాయలు, పలు రకాల పూలు సమర్పించా రు. పూజారి సత్యనారాయణ ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం స్వాములు అందరికీ సర్పంచ్ ఓగుల పూజ.-రాజేందర్ అన్న దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి రాజమల్లు, మాజీ ఉపసర్పంచ్ వీరగోని సాయి శేఖర్, రైస్ మిల్లర్స్ మాజీ మండల అధ్యక్షులు ఆనందరావు, నాయకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, వార్డు సభ్యులు సంపత్ రెడ్డి ,అనిల్ , శ్రీనివాస్ గౌడ్, శోభక్క,, శ్రీనివాసరావు, వెంకట్రావు , తిరుపతిరావు, అంజయ్య, మనోజ్, రాము లు, శ్రీ రామేశ్వరాలయం పాలక వర్గం పాల్గొన్నారు.






