మోదీ సభకు వేములవాడ నుంచి బీజేపీ శ్రేణుల తరలింపు
వేములవాడ, మే10,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాపెళ్లి శ్రీధర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్కు విచ్చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు హాజరవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, పిన్నింటి హనుమాండ్లు,వాసం మల్లేశం, బిల్ల కృష్ణహరి, రేగుల శ్రీకాంత్, మామిండ్ల లక్ష్మీరాజం, మహంకాళి శ్రీనివాస్, మనోజ్, యశ్వంత్, మెరుగు లక్ష్మణ్, బాలశేఖర్, మల్లెపు లక్ష్మణ్తో పాటు పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






