నేటి అమరుల యాది బస్సుయాత్రను విజయవంతం చేయాలి
కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్
గణపురం ఆగస్టు16 (విజయ క్రాంతి): నేడు సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అమరుల యాదిలో బస్సు యాత్ర ప్రదర్శన సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల కృష్ణమూర్తి గౌడ్, తెలిపారు, ఆదివారం మండలం లోని కర్కపల్లి గ్రామంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తి రక్షణ కోసం. హక్కుల కోసం పనిచేసి అమరులైన కల్లుగీత కార్మిక సంఘం నాయకులను స్మరిస్తూ యాత్ర ను కొనసాగిస్తున్నామన్నారూ వృత్తి రక్షణ కోసం హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని కోరారు,
ఆగస్టు 2 మానుకోట జిల్లా కేంద్రంలో ప్రారంభమైన యాత్ర ఆగస్టు 18న హైదరాబాదులో పాపన్న జయంతిన ముగుస్తుందన్నారు, భూపాలపల్లి జిల్లా కేంద్రం కు విచ్చేస్తున్న సందర్భంలో ర్యాలీని సభను కల్లుగీత కార్మిక సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు, తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల మంది గీత కార్మికులు వృత్తిలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని చేతివృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి అన్నారు, ఈ వృత్తి రక్షణకు కార్మికుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడం విడ్డూరమన్నారు, ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు పాల్గొన్నారు






