మల్లారెడ్డి ఇంట్లో ఘనంగా మెహందీ
18-03-2026 01:17 AM
మేడ్చల్, మార్చి 17 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కల్పన దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం హల్దీ మెహందీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఉత్సాహంగా బుల్లెట్ నడిపారు. ఇటీవల సంగీత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.




