11 May, 2026 | 1:32 AM

తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. కుటుంబమే తన ప్రపంచం

11-05-2026 12:17 AM

ఘనంగా మదర్స్ డే వేడుకలు

తల్లులకు ప్రత్యేక బహుమతులు అందజేత 

పాస్టర్ పరంజ్యోతి కి ఘనంగా సన్మానం 

మహబూబ్ నగర్ టౌన్, మే 10: ఈ లోకంలో అందరికంటే తల్లి ప్రేమ వెలకట్టలేనిదని పాస్టర్ బిఎస్ పరంజ్యోతి అభివర్ణించారు. మదర్స్ డే సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ని రెమా వర్షిప్ సెంటర్లో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తల్లి కుటుంబాన్ని చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

తన కుటుంబమే ప్రపంచం గా భావించి అనునిత్యం పాటుపడుతూ శక్తిక వంచన లేకుండా నిత్యం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తల్లి ప్రేమను ప్రత్యేకంగా గుర్తించేందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్స్ డే వేడుకల్ని జరుపుకుంటున్నామన్నారు. కుటుంబం కోసం పాటుపడే తల్లిని గౌరవించడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు తల్లి తండ్రులను సన్మానించాలని బైబిల్ లో  దేవుడే చెప్పాడు అన్నారు.

ఇటీవలే పడవ ప్రమాదంలో చిన్న బిడ్డ కోసం తల్లి తన ప్రాణాల్ని ఫణ్ణంగా పెట్టిన సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తల్లులంతా తమ బాధ్యతను  గుర్తించుకుని దేవునికి ఇస్టులుగా  సమాజానికి ఆదర్శంగా రాణించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఘన సన్మానం: మదర్స్ డే సందర్భంగా చర్చిలోని తల్లులందరినీ ఘనంగా సన్మానించి వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. అనంతరం వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు దేవయ్య, లక్ష్మన్న రాజు, సిస్టర్స్ ప్రైయిజీరాణి, బ్లాండినా, మహిమ, మార్త లతోపాటు అధిక సంఖ్యలో విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.