10 June, 2026 | 2:48 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

వైభవంగా శ్రీ సీతారామాంజనేయ విగ్రహ పునః ప్రతిష్ఠాపన

26-03-2026 01:21 AM

భారీగా పాల్గొన్న భక్తులు

తాండూరు, మార్చి 25,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం ఇందిరానగర్ శ్రీరామ్ మందిర్ లో శ్రీ సీత, రామ ,లక్ష్మణ, ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన బుధవారం వైభవంగా జరిగింది. వేద పండితులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ శిఖరం, ధ్వజస్తంభం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఏర్పాటు చేశారు. జైశ్రీరామ్ ... జై జై శ్రీరామ్ నినాదాలతో ఇందిరానగర్ మారుమొగింది. ఆలయానికి నిర్వాహకులు రంగురంగుల పువ్వులతో విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.