10 June, 2026 | 3:57 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం... నర్సింలు యాదవ్

26-03-2026 01:19 AM

శామీర్ పేట్, మార్చి 25( విజయక్రాంతి): పేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. విడతల వారీగా నిధులు కేటాయిస్తూ ఇళ్లులేని వారికి సొంతింటి కల నెరవేరుస్తుందాని మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారు. బుధవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ 17 వార్డు (కోల్తూర్) లోని నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమ పథకాలను నిరుపేదలకు, అర్హులందరికీ అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఒక నిరంతర ప్రక్రియ అని పేదలందరికీ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, మాజీ ఎంపీపి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ పాపిరెడ్డి, మాజీ సర్పంచ్ శిల్ప యాదగిరి, మాజీ ఎంపిటిసి వెంకటేష్, కమిటీ అధ్యక్షుడు రమేష్, పాండు, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, బాలకృష్ణ, అనంత రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.