30 May, 2026 | 2:19 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు కార్యదీక్షతతో దూసుకుపోతున్న ఐటీ రంగం   •   మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత   •   BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ “అరెస్ట్”   •   దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •  

BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ “అరెస్ట్”

30-05-2026 01:46 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద శనివారం నాడు హైడ్రామా కొనసాగింది. తెలంగాణ భవన్ వద్ద నాంపల్లి పోలీసులు బాల్క సుమన్(BRS Leader Balka Suman Arrested ) ను అరెస్ట్ చేశారు. మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని బాల్క సుమన్ ఇటీవల పిలుపునిచ్చారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ అరెస్ట్ అనివార్యం అయింది.

అంతకు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నించే నేతలనున వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తనను టార్గెట్ చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 250కిపైగా కేసులు పెట్టారని వివరించారు. ఇటీవల క్యాతనపల్లి ఎన్నిక సమయంలోనూ తనను జైల్లో పెట్టారని వెల్లడించారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నానని చెప్పారు. తనను మరోసారి జైలుకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించారని ఆరోపించారు.

తనను జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలని పాలకులు భావిస్తున్నారని మండిపడ్డారు. తనపై దృష్టి పెట్టే ముందు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. సింగరేణిలో వందల కోట్ల విలువైన స్కాములు జరుగుతున్నాయి, సింగరేణి కుంభకోణాలమయంగా మారిపోయిందని బాల్క సుమన్ ఆరోపించారు. సింగరేణి బొందలగడ్డగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టంపై, వ్యవస్థలపై రాజ్యాంగంపై నమ్మకముందని బాల్క సుమన్ పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు.

బాల్క సుమన్ పై నమోదైన కేసులు ఇవే...

బాల్క సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో 326(G), 351(3), 353(1)(B), రెడ్ విత్ 55, రెడ్ విత్ 61(2)(A), BNS 4 PDPPA కింద కేసులు నమోదయ్యాయి.