20 August, 2026 | 1:41 PM

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

20-08-2026 01:10 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం టేకులపల్లి మండలం బోడు ఎక్స్‌ రోడ్డు సెంటర్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో, సాంకేతిక రంగ అభివృద్ధికి, యువతకు అవకాశాలు కల్పించడంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, నియోజకవర్గ నాయకుడు కోరం సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, రెడ్యానాయక్, పోశాలు, బానోత్ భద్రు, కృష్ణార్జునరావు, లక్ష్మయ్య, ముచ్చా సుధాకర్, వెంకన్న, అఫ్రోజ్, కోరం హనుమంతు, సైదులు, వినయ్, లవకుమార్, ఉమేష్, శేఖర్, హచ్చు, ఖానా, నిశాంత్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.