30-11-2024 01:34:21 PM
చికిత్స కోసం రు 2.50 లక్షల ఎల్ఓసి పంపిణీ చేస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్
మనోహరాబాద్,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబీకులకు ఆసుపత్రి చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరు కావడం ఎంతో మేలు జరుగుతుందని సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్లకల్ మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ తెలిపారు. మండలంలోని లింగారెడ్డి పేట గ్రామానికి చెందిన వడ్ల దయానంద చారి గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో శనివారం సీఎంఆర్ఎఫ్ రు 2.50 లక్షల ఎల్ఓసి మంజూరు కావడంతో వారి కుటుంబ సభ్యులకు అందజేశామాని తెలిపారు. వారి వెంట కాసం రంజిత్ రెడ్డి, వడ్ల వెంకట చారి, పిట్ల వెంకటేష్, బల రాజు తదితరులు ఉన్నారు.