calender_icon.png 23 July, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీచక టీచర్.. ఇంటర్ విద్యార్థికి అసభ్యకర సందేశాలు

30-11-2024 01:30:34 PM

హైదరాబాద్: విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన గురువే తప్పు బాట పట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటర్ విద్యార్థిని టీచరల్ వేధించిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ లోని మదీనాగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో హరీష్ అనే లెక్చరర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ఫోన్లో అసభ్య మెసేజ్లు పంపుతున్నాడు. మీకు నాపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అంటూ మెసేజ్ లు చేయడమే కాకుండా ఒంటరిగా కనిపించిన అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినిలు తెలిపారు.

అంతేకాకుండా నేను చాట్ చేసిన విషయాలు, ఇంకేమైన బయటకు వస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడని, ఆ విషయం బయటకు చెప్పకుండా కాలేజీ డీన్ నాగరాజు, ప్రిన్సిపాల్ ప్రభులు విద్యార్థులతో మాట్లాడి ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా బెదిరించారని, లేదంటే మీకు జీవితమే లేకుండా చేస్తామని బెదిరించారని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తల్లితండ్రులు కంప్లైంట్ చేసిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. లెక్చరర్ ను కాపాడేందుకు కాలేజీ యాజమాన్యం యత్నిస్తోందని, మాకేం సంబంధం లేదని కాలేజీ యాజమాన్యం ఎలా చెబుతారని మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా అతడి వేధింపులు ఎక్కువ కావటంతో విద్యార్థులు ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో కుటుంబ సభ్యులు శనివారం కాలేజీకి వచ్చి యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడిని తమ ముందు హాజరు పరచాలని డిమాండ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని  పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు లెక్చరర్ పై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాలేజీ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్సై కోన వెంకటేశ్వర్లు కాలేజీ వద్దకు చేరుకుని బాధిత విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ కోసం పర్సనల్ నెంబర్ ఇవ్వాలని, లేదంటే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించారని విద్యార్థినులు ఎస్సై దృష్టికి తీసుకువచ్చారు.

ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి: పవన్, నవతెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షుడు 

శేరిలింగంపల్లిలోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్కాలేజీలో విద్యార్థులపై వేధింపులు ఎక్కువయ్యాయి. కార్పొరేట్ కాలేజీలు విద్యార్దుల మరణాలయాలుగా మారాయి. మొన్న మియాపూర్ కల్వరి టెంపుల్ రోడ్డులోని శ్రీచైతన్య జూనియర్ బాయ్స్ కాలేజీ మెయిన్ క్యాంపస్ లో కౌశిక్ రాఘవ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా తాజాగా మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా లెక్చరర్ వ్యవహార శైలి దాపురించిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థిని, వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకూ విద్యార్థి సంఘాలుగా వారికి అండగా ఉండి పోరాడుతామన్నారు. సదురు లెక్చరర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసి అతనిపై చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.