‘తెలంగాణ రక్షణ సేన’కు గుర్తింపునివ్వండి
- ఆ వెయ్యి అభ్యంతరాలను మాకు పంపండి
- కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల 7న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కవిత స మాధానం ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి హోదాలో అనిల్ కుమార్ ఆదివారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్‌కు, ఎన్నికల కమిషనర్ లకు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు తెలంగాణ రక్షణ సేన పార్టీ తమకు కేటాయించడంతో తెలంగాణ వ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించుకో వడంతో పాటు పార్టీ నిర్మాణ పరమైన ఇత ర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 23న తమకు లేఖ రాస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వ చ్చాయని పేర్కొన్నారని వివరించారు.. కానీ ఇంత వరకు ఆ అభ్యంతరాల్లో ఒక్కటి కూడా తమకు పంపలేదని తెలిపారు.. అభ్యంతరాలు ఎవరు తెలిపారు.. ఆయా అభ్యంతరా ల్లో ఏమి పేర్కొన్నారు అనే వివరాలు కూడా ఇవ్వలేదన్నారు.. అసలు అభ్యంతరాలనే తమకు పంపకుంటే తాము సమాధానం ఎలా చెప్పగలమని తెలిపారు.
ఈసీ ఆమోదించిన పేరును నమ్ముకొని సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకున్నామని.. ఇప్పుడు ఆ పేరును మార్చుకోవాలని అంటే అది తమకు తీవ్ర నష్టం, అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. ‘తెలంగాణ రక్షణ సేన’పార్టీ పేరుపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను, అలాగే తమకు వ్యతిరేకంగా ఉపయోగించాలనుకుంటున్న అన్ని ఆధారాలను తమకు అందజేయాలని కోరారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమాధానం ఇవ్వడానికి తమకు తగినంత సమయం ఇచ్చాకే... వ్యక్తిగత విచారణకు పిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29ఏ కింద ప్రతిపాదిత ‘తెలంగాణ రక్షణ సేన‘ పార్టీ గుర్తింపు కోసం తా ము చేసుకున్న దరఖాస్తును పరిశీలించి, ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.






