13 July, 2026 | 2:10 AM

సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

13-07-2026 12:38 AM

హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు

నేరేడుచర్ల, జూలై 12: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను సమర్థవంతంగా,ఎటువంటి అలసత్వం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు బిఎల్ వో లకు సూచించారు. నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని రామాపురం 34, 35 పోలింగ్ బూత్లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని తహసీల్దార్ సైదులుతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.

అధికారులు ఓటర్ల నుంచి వినతులు స్వీకరించి, సందేహాలకు సమాధానాలు అందిస్తూ సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఓటరు నమోదు, మార్పు లు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పోలింగ్ బూత్లలో జరుగుతున్న నమోదు ప్రక్రియ, ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మౌనిక, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, బీఎల్వోలు సావిత్రి, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.