6 June, 2026 | 2:41 AM

కేసుల నుంచి విముక్తి కలిగించండి

06-06-2026 01:21 AM

మహబూబాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): నిలువ నీడలేని పేదలు వేసుకున్న గుడిసెలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, గుడి సె వాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూ ర్ణపు సోమయ్య, ఆకుల రాజు డిమాండ్ చేశా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మా ట్లాడుతూ కొత్త కలెక్టర్ కార్యాలయం దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే వారిపై అనేక కేసులు బనాయించి, గుడిసెలను 23 సార్లు తొలగించారని తెలిపారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ  పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలం దరికీ పట్టాలిచ్చి ఇల్లు కట్టుకోవడానికి వెంట నే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, అలాగే పేదలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్  సీతారాం, సునీత, నలమాస బేబీ, వీరేందర్, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.