29 June, 2026 | 2:48 AM

118 పోస్టుల భర్తీకి పచ్చజెండా

10-06-2025 01:14 AM

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామకానికి ఆర్థిక శాఖ ఆమోదం 

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామకానికి ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసింది. ప్రాసిక్యూషన్స్ డైరక్టర్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలను సోమవారం ప్రభుత్వం సమీక్షించింది.

ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులను రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్నట్లు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.