10 June, 2026 | 3:55 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు గ్రీన్ గ్రోవ్ విద్యార్థుల ఎంపిక

19-11-2025 12:39 AM

చిట్యాల, నవంబర్ 18 (విజయ క్రాంతి): హైదరాబాద్ లోని  అయ్యప్ప సొసైటీ మాదాపూర్ సి.జి.ర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నవంబర్ 16 ఆదివారం రాష్ట్రస్థాయి త్రో  బాల్  పోటీలు నిర్వహించారు. పోటీలలో  చిట్యాల మున్సిపాలిటీ పరిధి లో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలకు చెందిన రాధారపు భవ్య శ్రీ, స్టాండ్ బైలో పోకల ప్రీతి జెస్సి, రాష్ట్రస్థాయి త్రో బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపిక అయ్యారు.

ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులు డిసెంబర్ 5 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని బాద్లాపూర్‌లో జరిగే 35వ జూనియర్ జాతీయస్థాయి త్రో బాల్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల సామాజిక స్ఫూర్తిని కలిగిస్తాయని , ఆటల వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, సమాజంపై అవగాహన కలుగుతుందని అన్నారు. అంతే కాకుండా  విద్యార్థులకు భవిష్యత్తులో  క్రీడా విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోలా గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.