19-11-2025 12:19:41 AM
హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షా ఫలితాలపై హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. 2019లో ఇచ్చిన ఎంపిక జాబితాను రద్దు చేసినట్లుగా సమాచారం. 2015లో గ్రూప్-2 ఓఎంఆర్ షీట్‌లో వైట్‌నర్ వాడారని, ట్యాంపరింగ్‌కు గురైందంటూ కోర్టులో పిటిషన్ దాఖలవడంతో మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు సెలక్షన్ లిస్టును రద్దు చేసినటుగ్లా తెలిసింది.
హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించినట్లుగా హైకోర్టు తెలిపినట్లు సమాచారం. టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొంది. ఓఎంఆర్ పత్రాలను పునర్‌మూల్యాంకనం చేసి అర్హుల జాబితా ప్రకటించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించినట్లుగా సమాచారం. 8 వారాల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని టీజీపీఎస్సీని ఆదేశించినట్టు తెలుస్తున్నది. దాదాపు వెయ్యికిపైగా పోస్టులను అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింది. అప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇప్పుడు వివిధ హోదాల్లో ఉన్నారు.