19-11-2025 11:09:24 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రతిష్టాత్మక ఇండియన్ పికిల్ బాల్ లీగ్(ఐపీబీఎల్) తొలి సీజన్లో పోటీపడే ఐదు నగరాల ఫ్రాంచైజీల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుందని హైదరాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న ఒపెరామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అనుభవ్ త్యాగి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ తో కలసి ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీ ఇందిరా గాంధీ స్టేడియంలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 7 వరకు ఈ లీగ్ పోటీలు జరుగుతాయన్నారు.