8 August, 2026 | 1:15 AM

వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

08-08-2026 12:00 AM

2 వేల మొక్కలు నాటిన జోగినిపల్లి సంతోష్‌కుమార్

గజ్వేల్ , ఆగస్టు 7 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి అవెన్యూ ప్లాంటేషన్లో 2 వేల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్రెడ్డి, ఒంటేరు ప్రతాప్రెడ్డి, గ్రామ సర్పంచ్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారని అన్నారు. సాగునీరు, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు ఆయన ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా చెట్ల పెంపకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారని తెలిపారు. కేసీఆర్ స్ఫూర్తితో జోగినిపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించి దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మొక్కలు నాటే ఉద్యమంలో భాగస్వాములను చేశారని కొనియాడారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. వెంకటాపూర్లో గ్రామ సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో 2 వేల మొక్కలు నాటడం ఆనందంగా ఉందని యాదవ రెడ్డి పేర్కొన్నారు.