పచ్చి రొట్ట ఎరువులతో రైతులకు ఎంతో మేలు
27-05-2026 01:55 AM
పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్
కొడంగల్, మే 26(విజయక్రాంతి ): పచ్చి రొట్ట ఎరువులతో రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. కొడంగల్ పట్టణంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో చైర్మన్ శివకుమార్ రైతులకు పచ్చి రొట్ట ఎరువులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..రైతులకు పంట సాగులో పచ్చి రొట్ట ఎరువులు ఎంతో లాభదాయం కల్గిస్తాయని అన్నారు. రైతులు పచ్చి ఎరువులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలత, మండల ఏఓ లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.






