calender_icon.png 22 December, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్

19-10-2024 12:00:00 AM

అఖిల్’ చిత్రంతో ఆరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్.. ఆ సినిమా సహా తరువాత నటించిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలివ్వలేదు. ‘ఏజెంట్ ‘ చిత్రం కోసం అఖిల్ బాగా కష్టపడ్డా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యాడో ఏమో కానీ చాలా లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ గురించి ఒకటి కాదు, రెండు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ‘అయ్యగారు’ అనే చిత్రంలో అఖిల్ నటించేందుకు సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనికోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడని తెలుస్తోంది

. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. సాహోకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనిల్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరో చిత్రం కూడా అఖిల్ ఓకే చేసినట్టు సమాచారం. దర్శకుడు మురళి చెప్పిన కథ విన్న అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.