బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలకు లైన్‌క్లియర్
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- అధికారికంగా నోటిఫికేషన్ విడుదల
- ‘సబ్‌కా బీమా సబ్‌కా రక్షా చట్టం -2025’ అమలుకు మార్గం సుగమం
- ఎల్‌ఐసీలో మాత్రం పాత నిబంధనలే అమలు
- సంస్థలో ఎఫ్‌డీఐలకు 20% పరిమితి కొనసాగింపు
న్యూఢిల్లీ, మే ౨: దేశీయ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా కంపెనీల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ప్రత్యక్ష ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ శనివారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనలు ‘సబ్‌కా బీమా సబ్ కా రక్షా చట్టం ద్వారా అమలులోకి రానున్నాయి.
దీంతో దేశీయ బీమా రంగంలో విదేశీ భాగస్వామ్యం మరింత పెరగనుంది. అయితే.. విదేశీ కంపెనీలు బీమా యాక్ట్ 1938 నిబంధనలకు లోబడే పెట్టబడులు పెట్టాల్సి ఉంటుంది. భారత్ ఇన్సురెన్స్ రెగ్యులెటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి.
అలాగే కేంద్రం కొత్తగా బీమా కంపెనీలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిం ది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. కంపెనీ చైర్‌పర్సన్ లేదా మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగి క్యూటివ్ ఆఫీసర్ల(సీఈఓ)లో కనీసం ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి. విదేశీ వాటాల పెంపు విషయంలో ఆర్‌బీఐ నిర్దేశించిన ‘ఫెమా’ నిబంధనలను పాటించాలి. బీమా మధ్యవర్తులుగా పనిచేసే బ్యాంకులు మాత్రం, వాటి రంగానికి వర్తించే విదేశీ పెట్టుబడుల పరిమితులకే లోబడి ఉండాలి.
మెజారిటీ విదేశీ యాజమాన్యం కలిగిన సంస్థలు తప్పనిసరిగా కంపెనీల చట్టం ప్రకారం తమ కంపెనీలను లిమిటెడ్ కంపెనీలుగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్సురెన్స్ బ్రోకర్లు, రీఇ న్సూరెన్స్ బ్రోకర్లు, కన్సల్టెంట్లు, థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్లకూ కేంద్రం 100 శాతం ఎఫ్‌డీఐ అవ కాశం వర్తిస్తుంది.
ఎల్‌ఐసీ విషయంలో మా త్రం కేంద్ర ప్రభుత్వం పాత నిబంధనలనే కొనసాగిస్తున్నది. సంస్థ స్వయంప్రతిపత్తిని కాపా డుతూనే పరిమిత స్థాయిలో మాత్రమే విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించింది. ప్రస్తు తం సంస్థలో ౨౦ శాతంలోపు మాత్రమే ఎఫ్‌డీఐలకు అవకాశం ఉంది. కంపెనీలు ఎల్‌ఐసీ చట్టం-1956 ప్రకారం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.






