3 May, 2026 | 2:27 AM

దండకారణ్యంలో పేలిన మందుపాతర

03-05-2026 01:04 AM
  1. నలుగురు జవాన్లు మృతి
  2. ఐఈడీ నిర్వీర్యం చేస్తుండగా ఘటన

రాయ్‌పూర్, మే 2: ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి నలుగురు జవాన్లు మృతి చెందా రు. కాంకేర్ జిల్లా చోటాబిటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కాబేడా అడవుల్లో లొంగిపోయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారం మేరకు జవాన్లు ఐఇడీ మైన్‌లను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఓ అమర్చిన మందుపాతరను గుర్తించారు. దాన్ని శనివారం తొలగిస్తుం డగా పేలుడు సంభవించి డీఆర్జీకి చెందిన ఇన్‌స్పెక్టర్ సుఖ్రామ్ వట్టి, కానిస్టేబుల్ కృష్ణ కొమ్రా, కానిస్టేబుల్ సంజయ్ గడ్పాలేలు మృతి చెందారని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా తెలిపారు.

కానిస్టేబుల్ పరమానంద్ కొమ్రా తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బస్తర్ రేం జ్ ఐజీ సుందర్ రాజ్ మాట్లాడుతూ.. జవాన్ల మృతిపై విచారం వ్యక్తం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచా రం మేరకు గత కొన్ని నెలలుగా గతంలో దాచిపెట్టిన వందలాది ఐఈడీలను నిర్వీర్యం చేస్తు న్నామని చెప్పారు. ఈ రోజు జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు.