14 March, 2026 | 7:04 PM

గ్రీన్‌ఫీల్డ్ భూనిర్వాసితులకు అండగా ఉంటా

22-11-2025 12:00 AM

కడ్తల్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ రహాదారిలో ఫేస్-  2 కింద భూములు కోల్పోయే భూనిర్వసితులకు తాను అండాగా ఉంటనాని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు హామీనిచ్చారు. శుక్రవారం మండలంలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, కోనాపూర్, ముద్విన్ గ్రామాలకు చెందిన పలువురు రైతులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యను ఎమ్మెల్యే కు విన్నవించారు.

అనంతరం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను వివరించారు. భూ నిర్వసితుల కు న్యాయం జరిగిలే చూడాలన్నారు. పరిహారం విషయం లో  రైతులకు న్యాయం జరగని  పక్షంలో ప్రభుత్వం తో మాట్లాడి రైతు లకు తగిన నష్టపరిహారం ఇపిస్తానని, అన్ని విధాలుగా రైతులను ఆదుకొనే విదంగా తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. సమావేశం లో  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, తెలంగాణ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకుర్ల రవికాంత్ గౌడ్, ఫాక్స్ డైరెక్టర్ జోగు వీరయ్య, పాలకుర్ల కరుణాకర్ గౌడ్ వెంకట్ రెడ్డి, సుమన్, నారాయణ, పాండు రంగా రెడ్డి, జెన్నయ్య, శంకరయ్య, పాండు, మల్లయ్య, హరిష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.