అర్హులందరికీ సంక్షేమ పథకాలు
నియోజకవర్గ ఇన్చార్జి భీమ్ భరత్
మొయినాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): నియోజకవర్గంలో అరులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చేవెళ్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి భీమ్ భరత్ అన్నారు. శుక్రవారం మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామ అనుబంధ గ్రామమైన సజ్జన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇండ్లు లేని అరులైన పేదలందరికీ సొంతిల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నట్లు చెప్పారు.
విడుతల వారిగా అందరికి పథకాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొక్క బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పం రాఘవేందర్ రెడ్డి, పద్మారావు, నరేందర్, భాస్కర్, రాములు, తోల్కట్ట మాజీ సర్పం సత్యనారాయణ, జయరాం రెడ్డి, సుధాకర్ గౌడ్, మీనాజ్, గణేష్, కరణ్ కుమార్ లు వచ్చే శనివారం పాల్గొన్నారు.






