డొంకేశ్వర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, కొనుగోలు కేంద్రం సందర్శన భూభారతి దరఖాస్తులపై సమీక్ష
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ ఆర్జీలపై ఆరా
నిజామాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్‌లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి,
ఎంతమందికి నోటీ సులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా ఆన్ లైన్లో అన్ని అంశాలను అప్లోడ్ చేశారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శ కాలకు అనుగుణంగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు.
తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి, స్పష్టమైన కారణాలను పేర్కొనాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గడువు లోపు ఎస్.ఐ.ఆర్ పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ నరేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మధుసూదన్ ఉన్నారు.






