14 April, 2026 | 1:20 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

స్వచ్ఛ నమస్కారం!

20-02-2026 12:00 AM
  1. వేకువజాము నుంచే కమిషనర్ల ఫీల్డ్ రన్
  2. మూడు కార్పొరేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛతను వెలుగులోకి తెచ్చేందుకు మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. స్వచ్ఛ నమస్కారం నినాదంతో గురువారం తెల్లవారుజాము నుంచే హెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు తమ పరిధుల్లోని జోన్లు, సర్కిళ్లలో తనిఖీలు నిర్వహించారు.

పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు ప్రజాసౌకర్యాలపై అధికారుల బృందం క్షేత్రస్థాయి సమీక్షలు జరిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, రా జేంద్రనగర్ జోన్లలో జోనల్ కమిషనర్లు  పర్యటించారు. ఖైరతాబాద్ జడ్సీ ప్రియాంక అలా, సికింద్రాబాద్ జడ్సీ రవికిరణ్, రాజేంద్రనగర్ జడ్సీ అనురాగ్ జయంతి  తమ జోన్ల పరిధుల్లో అనేక ప్రాంతాలను పరిశీలించారు.

సైబరాబాద్ కమిషనర్ సృజన  నిజాంపేట్ సర్కిల్లో తనిఖీలు చేపట్టారు. ప్రగతి నగర్‌అంబీర్ చెరువు పరిసరాల్లో నెలకొన్న అపరిశుభ్రతపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  మల్కాజిగిరి  కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి  తన బృందం తో కలిసి పారిశుధ్య పనులను పరిశీలిం చారు.