11 August, 2026 | 2:37 PM

Breaking News

మాజీ డీసీసీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాదరావుపై ఆరోపణలు సరికాదు   •   ప్రాజెక్టుల గురించి మాకు పాఠాలు చెప్పక్కర్లేదు   •   కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు   •   చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించాలి   •   ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు   •   ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి   •   బెంగాల్ సర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు   •   ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •  

భైంసా పట్టణంలో గ్రీవెన్స్ డే

18-06-2025 06:23 PM

జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల..

భైంసా (విజయక్రాంతి): బైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే(Grievance Day) కార్యక్రమానికి బైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు బుధవారం స్వీకరించారు. వెంటనే ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) ఆదేశించారు. 

షీ టీమ్ సిబ్బందితో కొన్ని కుటుంబ కలహాల కేసులలో ఇరు పార్టీ వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం జరిగింది. ఇలా భైంసాలో షీ టీమ్ సిబ్బంది ద్వారా కౌన్సిలింగ్ తో కుటుంబాలు నిలబడుతున్నాయని మేము నిర్మల్ గాక రావటానికి కష్టంగా ఉండటాన్ని ఎస్పీ అర్తం చేసుకుని భైంసా  కౌన్సిలింగ్ ఇవ్వటం గురించి పిర్యాదు దారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను ఇప్పటి వరకు ఎన్ని పరిష్కారం అయ్యాయని, పెండింగ్ పిర్యాదుల పురోగతిని గురించి భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్ తో చర్చించటం జరిగింది.  ఈ కార్యక్రమం లో అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు నైలు, గోపినాథ్, మల్లేష్ , ఎస్సై లు గౌస్ ఆలం,అశోక్, శంకర్, మహిళా ఎస్ఐ పెర్సిస్ షి టీమ్ సిబ్బంది, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు.