4 May, 2026 | 12:28 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

18-06-2025 06:25 PM

ఘట్ కేసర్: ఏకశిలా నగర్ వెంచర్ వివాదంకు సంబంధించిన రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) అన్నారు. పోచారం మున్సిపల్ లోని ఏకశిలా నగర్ వివాదంకు సంబంధించి పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏకశిలా వెంచర్ తో పాటు సంస్కృతి టౌన్ షిప్ అప్రోచ్ రోడ్డును సందర్శించారు.

అనంతరం ఏకశిలా వెంచర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ... వారం రోజుల్లో హర్ష కన్ స్ట్రక్షన్స్ యజమాని వెంకటేష్, ఏకశిలా వెంచర్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇరువురి వద్ద ఏ డాక్యుమెంట్లు ఉన్న పూర్తి ఆధారాలతో రావాలన్నారు. హైకోర్టు ఉత్తర్వులు (స్టేటస్కో) ఏమైనా ఉంటే న్యాయ నిపుణులతో చర్చిస్తామని, ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.